ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

12.19.2009

అధికారులమధ్య సమన్వయ లోపం ...రైతులపాలిట శాపం


నూజండ్ల మండలంలో ప్రధాన నీటిపారుదాల వనరైన పి.బి.సి. తరచూ వివదాల పాలవుతున్నది. గుంటూరు ,ప్రకాశం జిల్లాలలో పలు గ్రామాలకు సాగునీరు త్రాగునీరు అందించే ఈ కాల్వ అధికారుల అనాలోచిత పర్యవేక్షణ కారణంగా రైతులమధ్య చిచ్చురేపుతున్నది.

శనివారం రవ్వవరం పి.బిసి. రెగ్యులేటర్ వద్ద ,ప్రధానమైన జమ్మలమడుగు ,మోదేపల్లి మేజర్లకు వారబంధి పెట్టాలనుకున్న అధికారుల నిర్ణయాన్ని రైతులు ,నీటిసంఘాలు వ్యతిరేకించారు. దరిశి బ్రాం చ్ కెనాల్ నుంచిపి.బి.సికి రావలసిన వాటా నీటిని విడుదల చేస్తే ఇరు మేజర్ల క్రింద పొలాలకు నీటిసమస్య రాదని ,అలాకాకుండా నీటి లో అక్కడ కోతపెట్టి ఇక్కడ వారబంధీ అంటె ఎలా అని వాల్లు ప్రశ్నించారు. తీవ్రమైన వాగ్విదాలు జరగటం తో అధికారులు ఏవిషయాన్ని చెప్పకుండా వెనుదిరిగారు. దరిశి డిఈ మాట్లాడుతూ గుంటూరు జిల్లా అధికారులు నీటిని సరిగా విడుదల చేయటం లేదని అందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రకాశం ,గుంటూరు జిల్లా అధికారుల సమన్వయ లోపం రైతులపాలిట శాపమవుతుంది .తరచు రైతులమధ్య గొడవలకు కారణ మవుతున్నది .

11.25.2009

దమ్ముచక్రాల దెబ్బకు దుమ్మవుతున్న రోడ్లు

లక్ష లాది రూపాయలు వెచ్ఫ్హ్చిమ్చి మరమ్మత్తులు చేసిన రోడ్లు ఏడాది తిరగకుండానే దమ్ముచక్రాల ధాటికి దుమ్మవుతున్నాయి . అధికారుల ప్రయవేక్షణ మ్రుగ్యమవటం తో ప్రజాధనం వృధా అవటమే కాదు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి . వినుకొండ నియోజక వర్గం లో గత ఏడాది ఆర్ అండ్ బి వాళ్లు మరమ్మత్తులు చేపట్టి రోడ్లు బాగు చేసారు. ఇప్పుడు వ్యవసాయ పనులు ప్రారంభం కావటం తో దమ్ము ట్రాక్టర్లు తిరగటం వలన రోడ్లు పాడై పోతున్నాయి .

విపరీత వేగంతో ట్రాక్టర్ డ్రైవర్లు బండ్లు నడపటం తో దమ్ము కాకరాల రాపిడికి తారు పొరలు లేచిపోతున్నాయి . కొన్ని చోట్ల గుంతలు పడుతున్నాయి . బాధ్యతలేని విరివల్ల రోడ్ల రూపురేఖలే మారి పోతున్నాయి . రైతులు ఇపని తప్పనిసరి గనుక ట్రాక్టర్లను చిన్నగా నడిపితే అంతగా నష్టం జరగదు . కాని బాద్యత లేని తనం . దీనికి తోడూ ఆశాఖ దికారుల నిర్లిప్తత .వెరసి ఇరోజు ఈపూరు ,నూజండ్ల శావల్యాపురం ,వినుకొండ మండలాలలో ధ్వంసమైన రోడ్లు దర్శనమిస్తున్నాయి

11.24.2009

సాధారణమరణానికి కూడా అధికారులు వెళ్ళి నివాళులివ్వాలా?

సి.ఎం సోదరి మరణించారు .ఇది ఆకుటుంబానికి విషాద సంఘటన . కానీ ఎనభైరెండేల్ల పండు ముసలమ్మ మరణం జిల్లాకంతటికీ విషాదంలా గా కలెక్టర్ ,ఎస్పీ , శాసనసభ డిప్యూటీ స్పీకర్ [ఈయనంటే స్తానిక ఎమ్మెల్యే] ఇలా వరుసగా వెళ్ళి నివాళు లర్పించారు . ఎందుకని . నిత్యం సమస్యలతో సతమతమవుతున్న జిల్లాలో కీలక అధికారులకు సమయం చాలా విలువైనది. అలాంటిది పదవి ఉన్నవారి బంధుగణం కోసం సమయాన్ని వెచ్చించాల్సి న అవసరం వున్నదా ? అని జనం ప్రశ్నిస్తున్నారు. బంధువర్గమో లేక ఏదన్నా దుస్సంఘటనో అయితే అధికారుల పర్యటన అవసరం .తప్పదు. మొన్న నెల్లూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లో వినుకొండకు చెందిన ఓ వైశ్యకుటుంబం ఘోరప్రమాదానికి గురై తీవ్ర విచారం లో వున్నా ,అక్కడికెళ్ళి పలకరించటానికి సమయం ఇవ్వలేకపోయిన అధికారులు జీవితం సంపూర్ణంగా అనుభవించి కన్నుమూసిన ముసలవ్వ కోసం వెళ్లారంటె అధికార మాయ అని జనం విస్తు పోతున్నారు .

కాకుంటే ముఖ్యమంత్రిగారి సోదరి కి నివాళులర్పించిన రాజకీయ నాయకులెవరు కూడా తమ పడికట్టు పదాలు "ఈ మె అకాలమరణం రాశ్ట్రానికి తీరని లోటు " ఇలాంటి పదాలు వాడలేదు సంతోషం .

దత్తాభిషేకాలకు మీతరపున ఓకలశం ఏర్పాటు చేపించుకుని పాల్గొనవచ్చు

వినుకొండ ప్రాంతం లో ఆథ్యాత్మికంగా బహుసేవలను అందిస్తూ కార్యక్రమాలను చేపడుతున్న నూజండ్లమండలం రవ్వవరం గ్రామము లో వున్న "శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం " మరో ఆథ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టింది . వచ్చేనెల[డిసెంబర్] రెండవతేదీన రానున్న పౌర్ణమి సందర్భంగా అక్కడ సమీపంలో కూర్మగిరిపై వెలసిన "కొండగురునాథుని " క్షేత్రం లో దత్తజయంతి పూజలు నిర్వహిస్తున్నారు. ఒకటవతేదీ శుక్రవారం రాత్రి కి కొండమీద ధ్యానాలు జరుగుతాయి . రెండవతేదీ నౌదయం రుద్రసూక్తం తో స్వామివారికి అభిషేకములు ,అర్చనలు ,అనంతరము గాయత్రీ హోమము జరుపనున్నారు. నాథసాంప్రదాయం లో ప్రసిద్దమైన ఈ కొండమీద దత్తుడు దారు శిలామూర్తిగా వేలాది సంవత్సరాలనుంచి పూజలందుకోవటం విశేషము అదీ ఎండకెండుతూ, వానకు తడుస్తూ . రాష్ట్రం లో పలు ప్రాంతాలనుంచి భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు మాఘమాసంలో జరిగే తిరుణాల్లకు .

ఇంత ప్రసిద్దమైన ఈ క్షేత్రం లో దత్త పూజలు జరిపి ఆ ఆదిగురువు గురునాథుని అనుగ్రహం అందరికీ కలిగేలా చేయాలనే సంకల్పం తో ఈకార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పీఠ ప్రధాన సేవకులు దుర్గేశ్వర గారు తెలిపారు . స్వామికి భక్తులతరపున నూటా ఎనిమిది కలశాలతో అభిషేకం జరుపుతామని ,కోరిన వారి తరపున ఒక్కొక్కకుటుంబం పేరున ఒక్క కలశం ఏర్పాటు చేస్తామని వివరించారు . పూర్తి వివరాలకు ఈక్రింది లింక్ చూడండి .
http://durgeswara.blogspot.com/2009/11/blog-post_23.హ్త్


11.22.2009

"విశ్వమంగళ గోగ్రామ యాత్ర"


గోవు ను కాపాడుకోవటం ద్వారా సంస్కృతిని కాపాడుకోవాలన్న సందేశంతో సాగుతున్న "విశ్వమంగళ గోగ్రామ యాత్ర" ది:18-11-2009 న వినుకొండ నియోజకవర్గం లో ప్రవేశించింది.స్థానిక కన్యక పరమేశ్వరి అలయం నుంచి సాగిన రథ యాత్ర మెయిన్ బజార్, రైల్వేస్టేషన్,ఫాన్సీసెంటర్ మీదగ సాగింది.తరువాత బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో పర్యటించి గోసంరక్షణ ఆవశ్యకతను వివరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో చలవాది.రాధాకృష్ణ,జయవరపు.పృథ్వీనాథ్ పాల్గొన్నారు.

11.21.2009

శ్రీరామ


ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం

................................................................

శ్ర్రీగణేశాయ నమ: శ్రీ సరస్వత్యై నమ: శ్రీ గురుభ్యోనమ:

..............................................................

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్దిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి