ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

1.21.2011

ఉద్యోగ సంఘాల నిరశన


జాయంట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు పెన్ డౌన్ చాక్ డౌన్ కార్యక్రమంలో పాల్గొన్నారు
రాముడుపాలెం స్కూల్ లో ప్రధానోపాధ్యాయుల కుజరిగిన టెలికాన్ఫరెన్స్ ను బహిష్కరించారు. ఉద్యోగసంఘాల ఐక్యతవర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు.


అలాగే నియోజక వర్గంలోని నూజండ్ల లో సిద్దయోగి యోగయ్యస్వామి వారి తిరుణాళ్ల వైభవంగా జరిగింది .
అలాగే మండల పరిషత్ సర్వసభ్యసమావేశం కూడా ఈరోజు జరిగింది .

1.20.2011

కన్నుమూసిన మరో అన్నదాత

విధి వెక్కిరిస్తోంది ,వ్యవసాయం జూద మయిపోతుంది. అన్నం పెట్టేచెయ్యికదా ఆదుకుందామనే ఆలోచన ప్రభుత్వానికి గాని జనానికి గాని లేదు . ఇంకేం చేస్తాడు .ఈ మాయదారిలోకానికి సెలవంటూ అన్నదాత తానునమ్ముకున్న భూమితల్లి గర్భంలోకి వెళ్ళిపోతున్నాడు.
వినుకొండ నియోజక వర్గంలోని నూజండ్ల మండలం లో ఈరోజు మరో అన్నదాత కన్నుమూసాడు. కాదుకాదు బలవంతంగా తనప్రాణం తీసుకున్నాడు. పాతనాగిరెడ్డి పల్లె కు చెందిన నాదెండ్ల చిన వెంకటసుబ్బయ్య అప్పులుచేసి మరీ వ్యవసాయం చేస్తున్నాడు. ఈనాటి రైతులమ్దరి స్థితీ ఇదే . ఒకపక్క వరి మరోవంక మిర్చి సాగుచేస్తున్నాడు. వరి నష్టపరచింది , మిర్చి మోసం చేసేలాఉంది. ఒకవంక కుటుంబఖర్చులేకాక పిల్లలఫీజులుకూడా పెరిగిపోయి అప్పులపైవడ్డీలు
కట్టెదుట తాటిచెట్టులా కనపడుతుంటే దిక్కుతోచక నిన్నరాత్రి పొలానికి వెళ్ళి అక్కడే ఉన్న పురుగుమందు తాగాడు.పురుగులు నిర్మూలిస్తుందనుకుని పొలంమీద చల్లినప్పుడు మోసం చేసిన ఆ మాయదారి పురుగుమందు ఇప్పుడుమాత్రం ఆభూమిపుత్రుని నమ్మకాన్ని వమ్ముచేయలేదు. అన్నంపెట్టే చేయి అచేతనంగా మారింది. ఆరైతుకుటుంబం దు:ఖానికి మావంతు ఓకన్నీటిబిందువును జతచేరుస్తున్నాము
----------- వినుకొండ ప్రెస్ టీమ్