ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

7.12.2011

వైభవంగా శ్రీరామలింగేశ్వరస్వామి తిరునాళ్ల

వినుకొండటౌన్, జూలై 11: వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి తిరునాళ్ళ తొలి ఏకాదశి పర్వదినాన అత్యంత వైభవంగా జరిగింది. పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద, చిన్నకొండ(చిన్నతిరుమల)పై ఉన్న ఆలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. తిరునాళ్ళ సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వినుకొండ భక్తజనంతో కిటకిటలాడింది. గుంటూరు-కర్నూలు హైవే నుంచి మెయిన్ రోడ్డు గుండా బోసుబొమ్మ సెంటర్ మీదుగా కొండపైకి వెళ్ళే రహదారి కిక్కిరిసింది. కొండకింద మెట్ల వద్ద ఉన్న స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపించి భక్తులు కొండపైకి తరలివెళ్ళారు. ఎటుచూసినా శివనామస్మరణే..

తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా పెద్దకొండ, చిన్నకొండల పైనే కాకుండా పట్టణంలోని ప్రధాన వీధులన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. వీధివీధినా వివిధ స్వచ్ఛంద, వ్యాపార వర్గాలు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. మున్నెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు.