ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

10.18.2011

గత యాబై సంవత్సరాలలో మూడు లక్షల మంది పసికందులను అపహరించిందట ఈ మతసంస్థ

http://www.dailymail.co.uk/news/article-2049647/BBC-documentary-exposes-50-year-scandal-baby-trafficking-Catholic-church-Spain.html

గత యాబై సంవత్సరాలలో మూడు లక్షల మంది పసికందులను అపహరించిందట ఈ మతసంస్థ.
ఎంతఘోరం ? చదావండి పై లింకులో

10.15.2011

రియల్ ఎస్టేట్ రంగంలో తొలి తెలుగు మాసపత్రిక "ఆస్తి" ప్రారంభం



రియల్ ఎస్టేట్ రంగంలో వివరాలను తెలిపే ఓ కొత్తమాసపత్రిక "ఆస్తి" ఈరోజు ప్రారంభించబడింది . హైదరాబాద్ లో డిప్యూటీ సిఎమ్ దామోదర రాజనరసింహ కొత్త పత్రికను ఆవిష్కరించారు . రియల్ ఎస్టేట్ రంగంలో చట్టాలను ,వివిధ విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగించటమే ధ్యేయంగా రాష్ట్రంలో మొట్టమొదటగా వచ్చిన ఈపత్రిక విజయవంతమవ్వాలని ప్రజలకు కరదీపికలా పనిచేయాలని ఆయన ప్రారంభోపన్యాసంలో కోరారు.

పత్రికను ఇక్కడ చూడొచ్చు
www.aasthi.net

10.12.2011

ప్రమాదంలో మహారాష్ట్ర డ్రైవర్ మృతి





వినుకొండ నియోజక వర్గంలోని నుజండ్ల మండలం కొత్తపాలెం నుండి మహారాష్ట్ర లోని బలహార్శా కు యూకలిప్టస్ కట్టెల లోడు తో వెళుతున్న లారి ప్రమాదానికి గురైనది .11 kw లైన్ విద్యుత్ తీగలు తగలటంతో లారి డ్రైవర్ రజిత్[౨౫] మరణించాడు . వినుకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

ప్రమాదంలో మహారాష్ట్ర డ్రైవర్ మృతి

9.26.2011

నూజండ్ల మండలంలో పాఠశాల విద్యార్థులకు ఈరోజు అధికారులు దుస్తుల పంపిణీ


నూజండ్ల మండలంలో పాఠశాల విద్యార్థులకు ఈరోజు అధికారులు దుస్తుల పంపిణీ చేసారు . మండలకేంద్రమైన నూజండ్ల,లక్ష్మీపురం, రాముడు పాలెం తండా పాఠ శాలలో ఇంచార్జ్ మడలాభివ్రుద్ది అధికారి బ్రహ్మయ్య,ఎ వో వి.వి. రమేష్
లు పిల్లలకు దుస్తులు అందజేశారు

7.12.2011

వైభవంగా శ్రీరామలింగేశ్వరస్వామి తిరునాళ్ల

వైభవంగా శ్రీరామలింగేశ్వరస్వామి తిరునాళ్ల

వినుకొండటౌన్, జూలై 11: వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి తిరునాళ్ళ తొలి ఏకాదశి పర్వదినాన అత్యంత వైభవంగా జరిగింది. పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద, చిన్నకొండ(చిన్నతిరుమల)పై ఉన్న ఆలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. తిరునాళ్ళ సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వినుకొండ భక్తజనంతో కిటకిటలాడింది. గుంటూరు-కర్నూలు హైవే నుంచి మెయిన్ రోడ్డు గుండా బోసుబొమ్మ సెంటర్ మీదుగా కొండపైకి వెళ్ళే రహదారి కిక్కిరిసింది. కొండకింద మెట్ల వద్ద ఉన్న స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపించి భక్తులు కొండపైకి తరలివెళ్ళారు. ఎటుచూసినా శివనామస్మరణే..

తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా పెద్దకొండ, చిన్నకొండల పైనే కాకుండా పట్టణంలోని ప్రధాన వీధులన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. వీధివీధినా వివిధ స్వచ్ఛంద, వ్యాపార వర్గాలు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. మున్నెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు.