ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

11.27.2015

105 సవరణలు చేసిన కాంగ్రెస్ , రాజ్యాంగాన్ని మారిస్తే రక్తపాతం జరుగుతుంది బెదిరించడం.

నిన్నరాజ్యాంగ దినం ఆట......
జపాన్ రాజ్యాంగం జనరల్ డగ్లాస్ మెక్ ఆర్ధార్ కేవలం ఒక్క రాత్రి లో రాశాడు. దాన్ని ఈ రోజు వరకూ సవరణ చేయలేదు. ప్రపంచాన్ని యేలిన ఇంగ్లీష్ దేశం బ్రిటన్ కి అసలు రాజ్యాంగమే లేదు. మొన్నటి వరకూ వాళ్ళకి సుప్రీం కోర్ట్ కూడా లేదు. అమెరికా రాజ్యాంగం కేవలం రెండు పేజీలే. మరో పదహారు పేజీ లు సంతకాలు. అమెరికా రాజ్యాంగం రాయడానికి పట్టిన సమయం 40 నిముషాలు. దాన్ని 16 నెలల పాటు అన్నీ రాష్ట్రాలు తీసుకెళ్లారు. ఇంతవరకూ అమెరికా రాజ్యాంగానికి జరిగిన సవరణ లు కేవలం పాతిక. వాటిలో పది మొదటి సంవత్సరం లోనే బిల్ ఆఫ్ రైట్స్ (ఫండమెంటల్ రైట్స్) కోసం జరిగాయి. ఆఖరు సవరణ బిల్ క్లింటన్ సమయం లో జరిగింది.
ఇక దరిద్ర భారత దేశపు రాజ్యాంగాన్ని రాయడానికి మూడేళ్లు పట్టింది. అదేదో ఒరిజినల్ అంటే అదీ కాదు, మిగిలిన దేశాల రాజ్యాంగాలు కాపీ కొట్టి చెత్తా చెదారం పోగేసి కలగా పులగం చేసి ఒక పుస్తకంరాశి మొహాన కొట్టారు. అప్పుడు ఇండియా లో 98 శాతం మందికి చదువు రాదు, ఇప్పుడు కూడా అంటే అనుకోండి, కాబట్టి నడిచిపోయింది. మన రాజ్యాంగం నిండా బొక్కలే
మన మొదటి సవరణ ఎప్పుడు జరిగిందో తెలుసా 1951 లో. అది కూడా రైట్ తో ఎక్స్ప్రెషన్ ( వాక్ స్వాతంత్రపు హక్కు) ని తగ్గించడానికి.
రాజ్యాంగం మూడేళ్లు ప్రజల సొమ్ము బొక్కి రాసిన మొదటి సంవత్సరం లోనే సవరించారు అంటే అసలు దాని మీద ఆ రాసిన వాళ్ళకి యే మాత్రం నమ్మకం ఉందో అర్ధం కావడం లేదూ. వింతల్లో కెల్లా వింత ఏమిటి అంటే రాజ్యాంగం లో ఉన్న ప్రాధమిక హక్కులు ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 21 వరకూ అసలు ప్రాధమిక మైనవే కాదు అనిన్నీ, ప్రభుత్వం కావాలంటే వాటిని అటక ఎక్కించవచ్చు అనిన్నీ సుప్రీం కోర్ట్ తీర్పు కూడా ఇచ్చింది.
ఇలాంటి విచిత్ర రాజ్యాంగం యే న్యాయ పరీక్ష కి కూడా నిలబడదు. సుప్రీం కోర్ట్ కనుక భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఏర్పాటు చేసి ఉంటే ఈ రాజ్యాంగాన్ని మొదటి రోజే చెత్త అని కొట్టేసి ఉండేది. ఆ విషయం తెలుసు కాబట్టే ప్రిన్సెస్ కోర్ట్ ( పాత సుప్రీం కోర్ట్ ) ని 1950 జనవరి 25 వ తేదీ రద్దు చేశారు.
ప్రపంచం లో ఎక్కడ అయినా రాజ్యాంగం ప్రకారం పని జరగకపోతే పని మారుస్తారు కానీ ఇండియా లో రాజ్యాంగాన్నే మార్చేస్తారు smile emoticon
మరో వింత ఏమిటో తెలుసా రాజ్యాంగానికి 105 సవరణలు చేసిన కాంగ్రెస్ , రాజ్యాంగాన్ని మారిస్తే రక్తపాతం జరుగుతుంది అని పార్లమెంట్ లో బెదిరించడం.
Article is taken from a wise friend, the irony, the constitution has nothing original in it. Word by word rip off from many other constitutions. But our people talk about originality

No comments:

Post a Comment